బిజినెస్ ఉమెన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేసిన తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది గ్లామర్ భామ అనుష్కా శర్మ. గ్లామర్ పాత్రలతోపాటు నటిగా నిరూపించుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా వుండే అనుష్క, అటు బిజినెస్ వ్యవహారాల్లో కూడా తనదైన సత్తా చాటుకుంటోంది. గత కొంతకాలంగా క్రికెటర్ విరాట్ కోహ్లితో ప్రేమాయణం సాగిస్తున్న అనుష్క పెళ్లికి రెడీ అయింది. ఇక కెరీర్ పరంగా చూసుకుంటే ఈ ఏడాది బిజినెస్ పరంగా తనదైన మార్క్ సృష్టించి ఏకంగా 220 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఓ వైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూనే మరోవైపు సినిమాలతో బిజీగా వున్న అనుష్కతో తమ ప్రొడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలంటే ఖచ్చితంగా నాలుగు కోట్లు చెల్లించాల్సిందేనట. దాంతోపాటు ఇనె్వస్ట్‌మెంట్స్ బిజినెస్‌లోనూ సత్తా చాటుకుంటున్న ఈమె, నిర్మాతగా కూడా అడుగులేస్తోంది. ఈమధ్యే ఎన్.హెచ్.10 చిత్రాన్ని నిర్మించిన అనుష్క, ఆ సినిమాతో మంచి లాభాల్నే అందుకుంది. దాంతోపాటు మరో రెండు చిత్రాలను నిర్మిస్తూ బిజీగా మారింది.

చిత్రం..అనుష్కా శర్మ