చిత్ర

మంచి అవకాశమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎవరికైనా తండ్రితో కలిసి నటించడం మంచి అవకాశమే కదా! అలాంటి అవకాశం వస్తే వదులుకుంటారా? నేనైతే అదొక గొప్ప అరుదైన అవకాశంగా భావిస్తాను’ అంటోంది శత్రుఘ్నసిన్హా తనయ సోనాక్షి సిన్హా. 1969లో వచ్చిన ‘ఇత్త్ఫాక్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన చిత్రంలో సోనాక్షి నటించిం ది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా సోనాక్షి తన తండ్రితో కలిసి నటించే అవకాశం ఈ చిత్రంలో వచ్చినా జస్ట్‌లో మిస్ అయిందంటూ చెప్పుకొచ్చింది. మాతృక సినిమాను గుర్తుచేసుకుంటూ ఆయా దర్శక నిర్మాతలు ముందు తన తండ్రిని సంప్రదించారని, కొన్ని అనివార్య కారణాలవల్ల ఆయన ఆ చిత్రంలో నటించలేదని చెప్పుకొచ్చింది. ఒకవేళ ఆయనే కను క నటించి వుంటే.. నాకెంతో సంతోషంగా వుండేదని, అదొక థ్రిల్లింగ్ అనుభవంగా భావించేదాన్నంటూ చెప్పింది. ఏదేమైనా మంచి ఛాన్స్ మిస్ అయిందనే చెప్పుకోవాలి!

చిత్రం..సోనాక్షి సిన్హా