హన్సిక ప్రేమాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లా మర్ భామ హన్సిక ప్రస్తుతం కోలీవుడ్‌లో బాగానే సెటిల్ అయింది. అటు కుర్ర హీరోలతో.. ఇటు పేరున్న హీరోల సరసన అవకాశాలు బాగానే పట్టేస్తున్న ఈ అమ్మడు తాజాగా కొత్త ప్రేమాయణం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో హన్సిక ప్రేమలో వుందంటూ వార్తలు ఓ రేంజ్‌లో షికార్లు చేస్తున్నాయి. నిజానికి ఆమధ్య హీరో శింబుతో ఘాటు ప్రేమాయణం సాగించిన ఈ అమ్మడు ఎందుకో అతనికి బ్రేక్ అప్ చెప్పింది. మళ్లీ సినిమాలపై సీరియస్‌గా దృష్టిపెట్టిన ఈ భామను ప్రేమలో దింపింది ఎవరో తెలుసా? యువ హీరో అధర్వ. అవును.. ఈమధ్య వీరిద్దరిమధ్య మంచి స్నేహం కుదిరిందని.. ఎక్కడ చూసినా ఇద్దరూ కలిసే తిరుగుతున్నారని రూమర్స్ ఎక్కువయ్యాయి. తాజాగా వీరిద్దరితో కలిసి ఓ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. దాంతో ఈ వార్తలకు ఇంకా బలం చేకూర్చినట్టయింది.