బాలయ్య 103?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ జోరు మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. ఇప్పటికే 102 సినిమాను దాదాపు పూర్తిచేసిన బాలకృష్ణ ఈ సంక్రాంతికి రానున్నాడు. ‘జైసింహ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలకు ఓకె చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సీనియర్ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. సోషియో ఫాంటసీగా ఈ సినిమా వుంటుందని, ఇందులో బాలయ్య అంతరిక్ష యాత్రికుడిగా కనిపిస్తాడట. దాంతోపాటు మరో కుర్ర దర్శకుడికి ఓకె చెప్పాడని టాక్. లేటెస్టుగా రవితేజతో రాజా ది గ్రేట్ సినిమా తీసిన అనిల్ రావిపూడి ఇప్పటికే బాలయ్యకు కథ వినిపించాడని, కథ నచ్చడంతో దాన్ని డెవలప్ చేయమని చెప్పాడట. ప్రస్తుతం అదే పనిలో బిజీగా వున్న అనిల్‌తోనే తన 102వ సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట. దిల్ రాజు నిర్మించే ఈ సినిమా జనవరిలో సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.