‘ఎంసిఏ’ నచ్చేస్తాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని, సాయిపల్లవి జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్ రూపొందిస్తున్న చిత్రం ‘ఎంసిఏ’. ఈ చిత్రాన్ని ఈనెల 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. పరీక్షలు పూర్తయి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉన్నామని, ఫస్ట్‌లుక్ విడుదల చేసినప్పటినుండి టీజర్‌కు, పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని నిర్మాతలు తెలిపారు. భూమిక ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారని, 30 నిమిషాలకే సినిమా ట్రైలర్ లక్ష వ్యూస్ రాబట్టిందని, ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని వారు తెలిపారు. టీజర్‌లో చెప్పినట్లు మిడిల్ క్లాస్ కుర్రాడు తను ఎంతో కష్టపడి ఎలా విజయం సాధించాడు? అన్న కథతో ఈ చిత్రం సాగుతుందని, టీజర్‌లో చెప్పినట్లు మిడిల్ క్లాస్ అనేది ఓ మైండ్ సెట్ అని, అది అందరిలో వుంటుంది కనుక అందరికీ నచ్చుతుందని దర్శకుడు వేణు శ్రీరామ్ తెలిపారు. క్రిస్మస్ సీజన్‌లో ఈ సినిమా విడుదల కావడం ఆనందాన్నిస్తోందని, తప్పక అందరికీ నచ్చుతుందని కథానాయకుడు నాని తెలిపారు.