‘ఎం.సి.ఎ’ సెన్సార్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని, సాయిపల్లవి జంటగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్-లక్ష్మణ్ నిర్మించిన ‘ఎం.సి.ఎ’ చిత్రానికి సంబంధించి సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ- ‘మా బ్యానర్‌లో ఈ ఏడాది శతమానం భవతి, నేను లోకల్, దువ్వాడ జగన్నాథమ్, ఫిదా, రాజా ది గ్రేట్ చిత్రాలతో వరుసగా ఐదు సూపర్‌హిట్ చిత్రాలను చేశాం. ఇప్పుడు ‘ఎం.సి.ఎ’తో డబుల్ హ్యాట్రిక్‌కు సిద్ధమయ్యాం. ఈ సినిమాతోడబుల్ హ్యాట్రిక్ సాధిస్తామని ధీమాగా చెబుతున్నాం. దర్శకుడు వేణు శ్రీరామ్ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. ఆయన దర్శకత్వంలో ఈ సినిమా ఎంతో లావిష్‌గా వచ్చింది. ఈ చిత్రంపై యూనిట్ అంతా హ్యాపీగా వున్నాం. ముఖ్యంగా నాని, సాయిపల్లవిలకు ఈ చిత్రంతో మా బ్యానర్‌లో మరో పెద్ద హిట్ రావడం గ్యారంటీ. అలాగే భూమిక ఇందులో వదిన పాత్రలో నటించారు. చాలా గ్యాప్ తర్వాత భూమిక తెలుగులో చేస్తున్న సినిమా ఇది. వదిన, మరిది మధ్య అనుబంధంపై సినిమా వుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని, నేపథ్య సంగీతాన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైనప్పటి నుంచి అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్‌కూ మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని అందరూ అంటున్నారు. అందరి అంచనాలు రీచ్ అయ్యేలా పూర్తి వినోదంతో సినిమాను ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సమీర్‌రెడ్డి విజువల్స్ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అవుతుంది. సినిమా ఎటువంటి కట్స్‌లేకుండా యు/ఎ సర్ట్ఫికెట్‌ను పొంది సెన్సార్ పూర్తి చేసుకుంది.