12న రానున్న ‘గ్యాంగ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య కథానాయకుడిగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందించిన ‘తాన సెరంధ కూటమ్’ చిత్రా న్ని తెలుగులో ‘గ్యాంగ్’గా అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ పతాకంపై రూపొందించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఇప్పుడు ఫస్ట్‌లుక్ టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ చిత్రం ద్వారా సూర్య తొలిసారిగా తెలుగు డబ్బింగ్ చెప్పారని, ఆయన మాటలు ముద్దు ముద్దుగా ఉండడంతో టీజర్‌ను రిపీట్ చేసి చూస్తున్నారని, విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ రావడం విశేషమని, సోషల్ మీడియాలో ట్రెండీగా నిలిచిందని నిర్మాతలు వంశీ ప్రమోద్ తెలిపారు. కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, కార్తీక్ ఇతర పాత్ర ల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, దర్శకత్వం: విఘ్నేష్ శివన్.