రాణిస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలు కలసిరాకపోవడంతో ఇప్పుడు హోటల్ బిజినెస్ వైపు అడుగులువేసింది కృతికర్బందా. ఇప్పటికైనా మంచిపని చేశావని మిత్రులు ఆమెను ప్రోత్సహిస్తుండటంతో ఇందులోనైనా రాణించాలని తాపత్రయపడుతోంది. టాలీవుడ్‌లో ‘బోణీ’ అనే చిత్రంతో తెరంగేట్రం చేసిన కృతికర్బందాకు విజయంలో మాత్రం బోణీ కాలేదు. అప్పటినుండి కెరీర్‌లో అనేక ఒడుదుడుగులు ఎదుర్కొన్న కృతి అటు కన్నడలో, ఇటు తమిళంలో అవకాశాలకోసం ప్రయత్నించింది. టాలీవుడ్‌లో సరైన ఆఫర్లు లేకపోయినా అప్పుడప్పుడు వచ్చిన అవకాశాలతో ఓ పది చిత్రాల దాకా నటించింది. తాజాగా కృతి వ్యాపార రంగంలో దిగి, హోటల్‌ను ప్రారంభించింది. మీల్స్ ఆన్ వీల్స్ అనే పేరుతో హోటల్‌ను ప్రారంభించింది. ఈ హోటల్‌లో అన్ని రకాల ఆహార పదార్థాలు క్షణంలో వాహనాలపై మన దగ్గరకు వచ్చేస్తాయి. అందరూ టెక్స్‌టైల్ వ్యాపారం, మేకప్ కిట్స్ వ్యాపారం లాంటివి చేస్తుంటే కృతి మాత్రం వెరైటీగా ఆహార పదార్థాల వైపు మొగ్గింది.