సెన్సార్‌లో పనిలేని పులిరాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమెడియన్ ధన్‌రాజ్ పదమూడు పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పనిలేని పులిరాజా’. చాచా దర్శకత్వంలో పాలెపు మీడియా పతాకంపై పి.వి.నాగేశ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ‘్ధన్‌రాజ్ సోలో హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ప్రాచీ సిన్హాతోపాటు నలుగురు హీరోయిన్లు ఉంటారు. ప్రస్తుతం సెన్సార్ జరుగుతోంది. మార్చి 2వ వారంలో విడుదల చేస్తామన్నారు. సహ నిర్మాత రవి మాట్లాడుతూ, వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో నాలుగు పాటలుంటాయని, త్వరలోనే ఆడియోను విడుదల చేస్తామని అన్నారు. దర్శకుడు చాచా మాట్లాడుతూ, పులిరాజుల వంశంపై వస్తున్న ఈ చిత్రంలో కామెడీతోపాటు చిన్న సందేశం కూడా ఉంటుందని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ మరుకుర్తి, సంగీతం వివి., మూలకథ, సహ నిర్మాత: రవి కె.పున్నం, నిర్మాత: పి.వి.నాగేశ్ కుమార్, దర్శకత్వం చాచా.