పెళ్ళికి రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియమణికి ఈ మధ్య అవకాశాలు సన్నగిల్లాయి. గ్లామర్‌తోపాటు నటనలో ప్రతిభను ప్రదర్శించే ఈ భామకు ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. దాంతో కన్నడంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకోటానికి ప్రయత్నించినా, లాభం లేకపోయింది. ఒకటీ అరా సిమాలు చేసిన ప్రియమణి ప్రస్తుతం సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ మధ్య ఓ బిజినెస్‌మేన్‌తో ప్రేమాయణం సాగిన ఈమె ఇప్పుడు అతగాడిని పెళ్లి చేసుకోటానికి సిద్ధమైందట. చేతిలో ఎలాగూ సినిమాలు లేవు కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోవడం సరైన నిర్ణయమని భావిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకొన్న ప్రియమణిని ఎక్కువ కాలం హీరోయిన్‌గా మనుగడ సాగించలేక పోయింది. త్వరలోనే పెళ్లి వివరాలు తెలుపుతానని చెప్పడం విశేషం.