అరకు రోడ్డులో.. ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌శంకర్, నికీషాపటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, సురేష్‌వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అరకురోడ్డులో’. ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. సినిమాకు సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కథానాయకుడు రామ్‌శంకర్ మాట్లాడుతూ, దర్శకుడు తనకు బాగా తెలిసినవాడని, అతని సత్తా తెలిసే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించడానికి ముందుకు వచ్చామని తెలిపారు. ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుని రెండో షెడ్యూల్ ప్రారంభించామని, మరో 20 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని ఆయన అన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్ పాలు ఎక్కువగా వుంటుందని, మే చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు వాసుదేవ్ తెలిపారు. వైజాగ్, పాడేరు ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలను రెండో షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నామని నిర్మాతలు అన్నారు. కార్యక్రమంలో నికీషాపటేల్, కోవై సరళ, జగదీష్ చీకటి, ఆకాష్‌పూరి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాహుల్‌రాజ్, వాసుదేవ్, కెమెరా: జగదీష్ చీకటి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, రచన, దర్శకత్వం: వాసుదేవ్.