పాట రికార్డింగ్‌లో ఐతే 2.0

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రనీల్ గుప్తా, జారాషా, అభిషేక్, కర్తవ్య ముఖ్యపాత్రల్లో రాజ్ మాదిరాజు దర్శకత్వంలో ఫరమ్9 పతాకంపై విజయరామరాజు, హేమంత్ వల్లపురెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఐతే 2.0’. ఈ చిత్రానికి సంబంధించిన పాట రికార్డింగ్ శుక్రవారం మోక్ష స్టూడియోలో రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ, నలుగురు నిరుద్యోగులు ఆధునిక టెక్నాలజీతో తనకు సంబంధంలేని, నేరంలో ఇరుక్కుని అదే టెక్నాలజీని ఉపయోగించి ఎలా బయటపడ్డారనే ఆసక్తికర అంశంతో తెరకెక్కించిన సినిమా ఇదని, టెక్నాలజీ, సోషల్ మీడియాలవల్ల లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయని, ఆకలి, ఆశ, ఆక్రోశం ఈ మూడు అంశాలమీద పాటలున్నాయని చెప్పారు. ఆశ కానె్సప్ట్‌మీద నరేష్ అయ్యర్ పాట పాడారని చెప్పారు. నరేష్ అయ్యర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా రూపొందిన కథ ఇదని, కిట్టు విస్సప్రగడ అందించిన పాటలు బాగున్నాయని, తెలుగులో తనకు ఈ పాట మంచి గుర్తింపు తెస్తుందన్నారు. నిర్మాత మాట్లాడుతూ ఇందులో వున్న పాటల్ని పాపులర్ సింగర్స్‌తో పాడించామని, ఈ సినిమాకు మ్యూజిక్ ప్లస్ అవుతుందని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే పాటల్ని విడుదల చేసి, ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కౌశిక్ అభిమన్యు, ఆర్ట్: రాజీవ్‌నాయర్, మాటలు, పాటలు: కిట్టు విస్సప్రగడ, దర్శకత్వం: రాజ్ మాదిరాజు.