మహేష్‌తో ఛాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను..శైలజ’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి మెప్పించిన కీర్తిసురేశ్ మంచి ఛాన్స్ కొట్టేసింది. ప్రఖ్యాత దర్శకుడు మురుగదాస్ రూపొందిస్తున్న చిత్రంలో మహేష్‌బాబు సరసన కథానాయికగా ఆమెకు అవకాశం దక్కిందని తెలుస్తోంది. తెలుగు, తమిళభాషల్లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయికగా ఎంపిక కావొచ్చంటూ కొంతమంది కథానాయికల పేర్లు వినిపించాయి. తాజాగా సమాచారం ప్రకారం, ఆ ఛాన్స్ కీర్తిసురేష్‌కి లభించే అవకాశం వుంది. ఇటీవల చెన్నయ్‌లో దర్శకుడు మురుగదాస్ మాట్లాడుతూ, కథానాయికగా కీర్తిసురేష్‌ను ఎంపిక చేయవచ్చనే హింట్ ఇచ్చాడట. దాంతో ఆమె ఎంపిక ఖరారైనట్టేనని అంటున్నారు. తెలుగు, తమిళ సినీరంగాల్లో ఇప్పుడు మంచి క్రేజ్ వుండటంతో ఆమె అయితేనే బెటర్ అని అంటున్నారు. ఏప్రిల్ రెండవ వారంలో ఈ సినిమాసెట్స్‌పైకి వెళ్లనుంది.