టిక్ టిక్ టిక్ టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయం రవి, నివేదా పెతురాజ్ హీరో హీరోయిన్లుగా చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో పద్మావతి చదలవాడ నిర్మాతగా వస్తోన్న చిత్రం ‘టిక్ టిక్ టిక్’. ఇండియన్ సినిమా చరిత్రలో తొలి అంతరిక్ష సినిమాగా ఈ సినిమా తెరకెక్కడం విశేషం. ఈ సినిమా టీజర్‌ను యంగ్ హీరో అడివి శేష్ విడుదల చేశారు. సినిమా త్వరలోనే తెలుగు, తమిళంలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అడివి శేష్ మాట్లాడుతూ- ఇండియన్ సినిమాలో తొలి స్పేస్ మూవీ టిక్ టిక్ టిక్. నాకు ఇష్టమైన హీరో జయం రవి ఈ సినిమాలో హీరోగా నటించారు. టీజర్ చూస్తుంటే హాలీవుడ్ మూవీ గ్రావిటీని తలపిస్తుంది. ఇండియన్ స్క్రీన్‌పై ఇలాంటి సినిమా రావడం చాలా గొప్ప విషయం. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలుస్తుంది అన్నారు. లక్ష్మణ్ మాట్లాడుతూ- మా బ్యానర్‌లో వచ్చిన బిచ్చగాడు సినిమాను అందరూ ఆదరించారు. ఆ తర్వాత 16 సినిమాను కూడా ఆదరించారు. ఇప్పుడు మరో భిన్నమైన చిత్రం ‘టిక్ టిక్ టిక్’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఇపుడు టీజర్‌ను కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ కూడా వుంది. తొలి ఇండియన్ స్పేస్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు మేం అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. జయం రవి, నివేదా పెతురాజ్‌లు అద్భుతంగా నటించారు. ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతారు అన్నారు. జయం రవి, నివేదా పెతురాజ్, జయప్రకాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీం: డి.ఇమ్మాన్, పాటలు: వెనె్నలకంటి, రాకేందు వౌళి, మాటలు: రాజేష్ ఎ.మూర్తి, కెమెరా: వెంకటేష్, ఎడిటర్: ప్రదీప్, నిర్మాత: పద్మావతి, చదలవాడ, దర్శకత్వం: శక్తి సౌందర్‌రాజన్.