‘రాబిన్‌హుడ్’ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ కథానాయకుడిగా నటించనున్న ‘రాబిన్‌హుడ్’ సినిమా ప్రారంభానికి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఈ సినిమాను మార్చి 4వ తేదీన లాంచ్ చేయనున్నారు. నిజానికి ‘ఎవడో ఒకడు’ తరువాత రవితేజ చేయవలసిన సినిమా ఇది. అయితే ఆ సినిమాను రవితేజ వదులుకోవడంతో ఈ సినిమా పట్టాలెక్కుతోంది.
చక్రి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో అమీజాక్సన్‌ని కథానాయికగా తీసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఆమె బిజీగా ఉండటంతో రాశిఖన్నాను ఎంపిక చేసుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘బెంగాల్ టైగర్’ సక్సెస్‌ను సాధించడంవలన, ఆమెకి ప్రాధాన్యతను ఇచ్చారు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు పూర్తికావడంతో మార్చి 4న సెట్స్‌పైకి వెళ్లనుంది.