అమ్మను మరువద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.కె. ఫిలింస్ పతాకంపై ప్రతాని రామకృష్ణగౌడ్ నిర్మాతగా పి.ఉదయభాస్కర్ దర్శకత్వంలో కృష్ణుడు, సన ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘అమ్మకు ప్రేమతో’. ఈ చిత్రం పోస్టర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అత్వాల పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం దర్శక నిర్మాతలు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ- ‘తెలుగువాళ్లంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నతనంలో ఎన్టీఆర్ గురించి చాలా విన్నాను. సినిమాలన్నా కూడా ఆసక్తి ఎక్కువే. మా పార్టీ సినిమా పరిశ్రమకు అండగా వుంటుంది. ఉద్యమ సమయంలో కెసిఆర్‌కు మేము మద్దతు ప్రకటించాము. రామకృష్ణగౌడ్‌తో మంచి అనుబంధం వుంది. ఆయన నిర్మించిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలి. అమ్మలేనిదే మనం లేము. అలాంటి అమ్మను మర్చిపోవద్దు’ అని అన్నారు. నిర్మాత ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ- ‘మంత్రి చేతులమీదుగా ఈ పోస్టర్‌ను విడుదల చేయడం ఆనందంగా వుంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. నటి కవిత మాట్లాడుతూ, మంత్రి సమక్షంలో ఈ వేడుక జరగడం ఆనందంగా ఉందని, మహిళా సాధికారత కోసం ఆయన ఎంతగానో కృషిచేస్తున్నారన్నారు.