‘గాయత్రి’ పోస్టర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోహన్‌బాబు ప్రధాన పాత్రలో మంచు విష్ణు, శ్రీయ, నిఖిలా విమల్ ముఖ్యపాత్రల్లో మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాయత్రి’. ఈ చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నిఖిలా విమల్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘నేను ఈ రోజు ఈ స్థాయిలో వున్నానంటే దానికి కారణం మా నాన్న’ అంటూ పోస్టర్‌పై క్యాప్షన్‌తో విడుదల చేశారు. దీంతో నిఖిలది కథలో కీలకపాత్ర అని అర్థమవుతోంది. బ్రహ్మానందం, అనసూయ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై అరియానా వివియానా, విద్యానిర్వాణ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:తమన్, కథ, మాటలు: డైమండ్ రత్నబాబు, కెమెరా:సర్వేష్ మురారి, ఎడిటింగ్:ఎం.ఆర్.వర్మ, నిర్మాత: మోహన్‌బాబు.ఎం., దర్శకత్వం:మదన్ రామిగాని.