ప్రచారంలో కొత్త ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిజిటల్ మీడియా ప్రస్తుతం అత్యంత పవర్‌ఫుల్‌గా మారింది. ఇప్పటికే వెబ్ న్యూస్‌లు, యాప్‌లు అంటూ నానా హంగామా చేస్తున్నారు. ఇక సినిమాల ప్రమోషన్ విషయంలో కూడా అడ్వాన్స్ అవ్వాలని కొత్త ప్రయోగానికి తెరతీశారు ‘అమీర్‌పేట టు అమెరికా’ చిత్ర యూనిట్ సభ్యులు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ చిత్రానికి సంబంధించిన ‘ఎ టు ఎ యాప్’ను విడుదల చేశారు. ఈ యాప్‌లో సినిమాకు సంబంధించిన ట్రైలర్, పోస్టర్ల వివరాలన్నీ వుంటాయని చెబుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అందుబాటులో వున్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్న ‘ఎ టు ఎ’ చిత్రం ఘన విజయం సాధించాలని అన్నారు. రాధా మీడియా పతాకంపై రామ్‌మోహన్ కొమండూరి, భానుకిరణ్ చల్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, మణిచందన, సమ్మెట గాంధి, రజని, వేణుగోపాల్, వేణుమాధవ్, తేజస్, పల్లవి దొర, వంశీ కోడూరి, మేఘనా లోకేశ్, వంశీకృష్ణ తదితరులు నటిస్తున్నారు.