జోరందుకున్న మెహబూబా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి, నేహాశెట్టి జంటగా తెరకెక్కిస్తున్న ‘మెహబూబా’ తాజా గా మరో షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. రెండు షెడ్యూళ్లు జరుపుకున్న ఈ చిత్రం సంక్రాంతి తరువాత మూడో షెడ్యూల్‌ను ప్రారంభిస్తారట. 1971 ఇండో పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్ నిర్మిస్తున్నాడు. తాజా షెడ్యూల్ హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, పంజాబ్ వంటి ప్రాంతాలతోపాటు హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంది. వరుస పరాజయాల తరువాత తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై పూరి భారీ ఆశలు పెట్టుకున్నాడు. మెహబూబాతో తన పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. త్వరలోనే కార్యక్రమాలన్నీ పూర్తిచేసి ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.