సుకుమార్‌తో మరోసారి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో టాప్ దర్శకుల లిస్టులో వున్న సుకుమార్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను స్వంతం చేసుకున్నాడు. ఆయన సినిమాలంటే అన్నింటికంటే భిన్నంగా వుంటాయి. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ‘రంగస్థలం’ చిత్రాన్ని రూపొందిస్తున్న సుకుమార్, ఆ తరువాత మహేష్‌బాబుతో ఓ సినిమా చేస్తాడని వార్తలొస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే మహేష్‌తో సుకుమార్ కథా చర్చలు జరిపాడని, ఓకే చెప్పిన మహేష్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. సుకుమార్, మహేష్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘1’ నేనొక్కడినే చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. అయినా సరే మరోసారి సుకుమార్‌తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట మహేష్. దానికి కారణం సుకుమార్ టేకింగ్ భిన్నంగా వుంటుందని టాక్! ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దీని తరువాత తన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ఈ సినిమా తరువాత మహేష్ 26వ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో వుంటుందని ఫిలింనగర్ టాక్.