బొబ్బట్టులాంటి రంగుల రాట్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున కొత్తదనాన్ని అందించడంలో ముందుంటారు. హీరోగా ఓవైపు విభిన్నమైన సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా అభిరుచిగల చిత్రాలను నిర్మిస్తున్నాడు. తాజాగా ఆయన నిర్మిస్తున్న చిత్రం రంగులరాట్నం. రాజ్‌తరుణ్ హీరోగా శ్రీరంజని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఆదివారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగార్జున చెప్పిన విశేషాలు ఆయన మాటల్లో...

సంక్రాంతి బొబ్బట్టు..
ఈ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే, అన్నపూర్ణ బ్యానర్ వాళ్ళు వడ్డించే సంక్రాంతి బొబ్బట్టు ఈ చిత్రం. సినిమా చూశాను. బొబ్బట్టు చాలా కమ్మగా వుంటుంది. తల్లీ కొడుకులమధ్య ఎమోషన్స్, ప్రేమించిన అమ్మాయి, అబ్బాయిలమధ్య వుండే ఎమోషన్స్, లవ్, ఫ్రెండ్‌షిప్.. ఇలాంటి అంశాలన్నీ హైలెట్‌గా వుంటాయి. కథలో చాలా కొత్తదనం వుంది.
అలా కుదిరింది..
సినిమా సరైన టైము చూసి విడుదల చేద్దామని అనుకున్నాం కానీ కరెక్టుగా సంక్రాంతికి పండుగకు థియేటర్లు దొరకడం సినిమాకు బాగా కలిసి వచ్చింది. నిజానికి సంక్రాంతికి సినిమాను ప్లాన్ చేయలేదు. కానీ ఈ పండుగకు వచ్చే పరఫెక్ట్ సినిమా. చూస్తున్నంతసేపు మనసారా నవ్వుకుంటాం. కొన్నిసార్లు కంటతడి పెడతాం. అన్ని రకాల ఎమోషన్లు ఉన్నాయి కాబట్టే ఇది రంగులరాట్నం అయింది.
ప్రేక్షకుడిలానే..
ఈ సినిమాని ఎప్పుడో ఏడాది క్రితం చూశాను. ఈ సినిమా తరువాత వంద కథలు విని వుంటా. కానీ ఈ సినిమా బాగా నచ్చింది. ఏకథనైనా ప్రేక్షకుడిలానే వింటా. అందుకే అన్నపూర్ణ బ్యానర్‌లో చేయాలని నిర్ణయించుకున్నాను. దర్శకురాలు శ్రీరంజనికి ఇది మొదటి సినిమా. ఈ సినిమాలో ప్రతి ఎమోషన్‌ని కొత్త పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. చాలా కొత్తగా అద్భుతంగా ప్రెజెంట్ చేసింది.
రాజ్‌తరుణ్‌తో..
రాజ్‌తరుణ్‌తో గతంలో ఉయ్యాల జంపాల చేశాం. నాకు రాజ్ తరుణ్ కామెడీ టైమింగ్ చాలా ఇష్టం. తన యాస కూడా కొత్తగా వుంటుంది. అది సినిమాకు బాగా ప్లస్ అయింది. ఈ చిత్రంలో సితార పాత్ర కూడా బాగుంటుంది. అన్నిరకాల ఎమోషన్స్‌తో వున్న రంగులరాట్నం సంక్రాంతి పండుగకి నవ్వులు కురిపిస్తుంది.

- శ్రీ