త్రివిక్రమ్ కోసం కొత్త అవతారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైలవకుశ తరువాత తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు ఎన్టీఆర్. ఇప్పటికే క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్‌తో ఆయన సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నదట. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గుతున్నాడట. దానికి కారణం కథ ప్రకారం కొత్త లుక్‌లో కన్పిస్తే బాగుంటుందని దర్శకుడు చెప్పడంతో ప్రస్తుతం అదే ప్రయత్నాల్లో వున్నాడు. ప్రస్తుతం విదేశాల్లో వున్న ఎన్టీఆర్, ఓ నిపుణుడి పర్యవేక్షణలో బరువు తగ్గే కసరత్తులు మొదలుపెట్టేశాడు. ఇటీవలే ఎన్టీఆర్‌ను చూసిన కొందరు షాకయ్యారట. ఎన్టీఆర్ స్లిమ్ లుక్‌లో అదిరిపోయేలా వున్నాడని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రం ఎన్టీఆర్‌కు మరో స్పెషల్ ఇమేజ్‌ను తీసుకొస్తుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాలో హీరోయిన్, మిగతా వివరాలు ప్రకటిస్తారట.