బంపర్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పరిణీతి చోప్రాకు కెరీర్ పరంగా పెద్దగా గుర్తింపు తెచ్చిన సినిమాలేవీ లేవు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఈమెకు వస్తున్న అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. దాంతో కాస్త గ్లామర్ డోస్ పెంచిన ఈ భామకు ఓ బంపర్ ఆఫర్ దక్కింది. బాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాలతోపాటు విభిన్నమైన సినిమాలను చేస్తూ స్టార్ హీరోగా జోరుమీదున్న అక్షయ్‌కుమార్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. అక్షయ్ తాజాగా పాడ్‌మెన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆసక్తిని రేపుతున్న ఈ సినిమాతో అక్షయ్‌కు మహిళా అభిమానుల్లో ఓ రేంజ్ క్రేజ్ పెరగనుందంటూ అంటున్నాయి బి టౌన్ వర్గాలు. ఈ సినిమా తరువాత అక్షయ్ నటించే మరో క్రేజ్ ప్రాజెక్టు సెట్స్‌పైకి రానుంది. కరణ్ జోహార్, అక్షయ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనురాగ్ సిన్హా దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో అదిరిపోయే రేంజ్‌లో రూపొందే ఈ చిత్రంలో పరిణితి ఛాన్స్ కొట్టేయడంతో ఆమె దశ తిరిగినట్టేనని అంటున్నారు సినీ జనాలు.