ఓంకార్ మరో చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆట టీవీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న నటుడు ఓంకార్, ఆ తరువాత దర్శకుడిగా మారి రాజుగారి గది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దానికి సీక్వెల్‌గా వచ్చిన రాజుగారి గది-2 కూడా మంచి విజయం సాధించడంతో ఓంకార్ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేదు. తాజాగా ఆయన మరో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈసారి హర్రర్ నేపథ్యంలో కాకుండా ఓ ఆట నేపథ్యంలో సినిమా చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే ఈ సినిమాలో హీరో కూడా కన్‌ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘సాక్ష్యం’ చిత్రంలో నటిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తాడని, కథ నచ్చడంతో ఆయన ఓకె చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇది ఓ ఆట నేపథ్యంలో సాగే కథ అని, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానున్నదట. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న ‘సాక్ష్యం’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాబట్టి త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. మరి ఈ యువ హీరోతో ఓంకార్ ఏమి ఆట ఆడిస్తాడో చూడాలి!