మహిళా దర్శకురాలితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ హీరో అయినా తెలుగు హీరోలతో సమానంగా మార్కెట్‌ను, అభిమానాన్ని సంపాదించుకున్న నటుడు సూర్య. ఆయన సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకూ అంతే ఆసక్తి. సూర్య నటించిన ‘తానా సెరెందాకూట్టమ్’ తమిళ చిత్రాన్ని ‘గ్యాంగ్’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమా తరువాత సూర్య, సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దాంతోపాటు కె.వి.ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. తాజాగా ఆయన మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ఈసారి ఆయన మహిళా డైరెక్టర్‌తో పనిచేస్తాడట. ఈమధ్యే వెంకటేష్‌తో ‘గురు’ చిత్రాన్ని తెరకెక్కించి దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధా కొంగర దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందట. ఇటీవలే సుధ సూర్యకు కథ చెప్పిందని, లైన్ నచ్చడంతో స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట సూర్య. త్వరలోనే వీరి కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కే అవకాశం వుంది.