ప్రత్యేక పాటలో శాంతాబాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఘవ్, కారుణ్య కత్రిన్, మీనాకుమారి ముఖ్యపాత్రల్లో కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో నంది క్రియేషన్స్ పతాకంపై ఎం.డి రఫీ మరియు రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘బంగారి బాలరాజు’. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేక సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటోంది. శాంతాబాయి సాంగ్‌తో యూత్‌ను ఆకట్టుకున్న ఐటెం గర్ల్ రాధికా పాటిల్ ఈ పాటలో నర్తిస్తుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర వివరాలు తెలియజేస్తూ- పరువు ప్రతిష్ఠలమధ్య సాగే సున్నితమైన ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రమిది. రాయలసీమలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా అల్లుకున్న అందమైన ప్రేమకథ ఈనెల చివరి వారంలో టీజర్‌ను విడుదల చేస్తున్నాం. దర్శకుడు కోటేంద్ర అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. తక్కువ టైమ్‌లోనే చిత్రాన్ని పూర్తిచేయడం ఆనందంగా వుంది. ఈ పాట చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చిన్నికృష్ణ, కెమెరా: జి.ఎల్.బాబు, నిర్మాతలు: కె.ఎం.డి.రఫి, రెడ్డమ్ రాఘవేంద్రరెడ్డి, దర్శకత్వం: కోటేంద్ర దుద్యాల.