తొలిప్రేమ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘తొలిప్రేమ’. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రంలోని పాటలను ఈనెల 20న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత భోగవల్లి ప్రసాద్ వివరాలు తెలియజేస్తూ- కెరీర్ ప్రారంభం నుండి భిన్నమైన చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వరు ణ్ తేజ్ నటిస్తున్న చిత్రమిది. హృదయానికి హత్తుకునే ప్రేమకథ. టైటిల్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్‌కు ప్రేక్షకులనుండి మంచి స్పందన వచ్చింది. తమన్ అందించిన సంగీతం హైలెట్‌గా నిలుస్తుంది. ఫిబ్రవరి 9న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జార్జ్ సి విలియమ్స్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, దర్శకత్వం: వెంకీ అట్లూరి.