బంపర్ ఆఫర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భామ అంజలికి ఈమధ్య సినిమాలు బాగా తగ్గాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘చిత్రాంగద’ భారీ పరాజయాన్ని చవిచూడటంతో అంజలి కెరీర్ అయోమయంలో పడింది. ప్రస్తుతం తమిళంలో బెలూన్ చిత్రంలో నటిస్తున్న ఈమెకు కొత్తగా అవకాశాలు రావడంలేదు. దాంతో మళ్లీ అవకాశాల కోసం జోరుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో నిర్మాతలకు బంపర్ ఆఫర్ ఇస్తుందట. ఎలాగూ అవకాశాలు లేవు కాబట్టి రెమ్యూనరేషన్ తగ్గించుకోవడంతోపాటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు వస్తే రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటిస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చిందట. తాజాగా ఓ తమిళ నిర్మాత అంజలి కోసం లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతనితో మరో చిత్రం చేయడానికి ఆసక్తి చూపిస్తుందట. మొత్తానికి అవకాశాలు లేకపోవడంతో అంజలి భామ దిగొచ్చింది.