త్వరలో టచ్ చేస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ రాజా రవితేజ, రాశీఖన్నా, సీరత్‌కపూర్ హీరో హీరోయిన్లుగా విక్రం సిరికొండ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘టచ్ చేసి చూడు’. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ- త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తికావచ్చాయి. ఈ చిత్రంలోని ఒక్కో పాటను సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నాం. ఇటీవలే విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రవితేజ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడంటూ అభినందనలు వస్తున్నాయి. రవితేజ ఇమేజ్‌కు తగ్గట్టుగా వంశీ అద్భుతమైన కథను అందించాడు. తప్పకుండా ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: గౌతంరాజు, కథ: వక్కంతం వంశీ, సంగీతం: జామ్ ఎయిట్, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్, వక్కంతం వంశీ, దర్శకత్వం: విక్రం సిరికొండ.