మంచు లక్ష్మి ‘వైఫ్ ఆఫ్ రామ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటిగా నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి మరోసారి సరికొత్త కానె్సప్టుతో తెరకెక్కుతున్న చిత్రంతో రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ‘వైఫ్ ఆఫ్ రామ్’గా ప్రకటించారు. విజయ్ యాలకంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మంచు లక్ష్మి పాత్ర భిన్నంగా వుంటుందని, అబద్ధాలను నిజాలని నమ్మే పాత్రలో కన్పిస్తుందని, సహజమైన నటనతో ఆకట్టుకుంటుందని చెబుతున్నాయి యూనిట్ వర్గాలు. మానవ సంబంధాలు, భావోద్వేగాల చుట్టూ తిరిగే కథ ఇదని, రాజవౌళి వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన విజయ్ యాలకంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కృతి ప్రసాద్, విద్యానిర్వాణ మంచు, ఆనంద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: రఘు దీక్షిత్, ఎడిటింగ్: తమ్మిరాజు, కెమెరా: సామల భార్గవ్, దర్శకత్వం: విజయ్ యాలకంటి.