ఏప్రిల్ నుండి సంఘమిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి-2 ఘనవిజయం తర్వాత అనేక బడా ప్రాజెక్టులకు సంబంధిచి పలు భాషల్లో ప్రకటనలు వచ్చాయి. తమిళ ఫిలింమేకర్ సి.సుందర్ కూడా ఓ భారీ చిత్రానికి సంబంధించి ప్రకటన చేశారు. సంఘమిత్ర అంటూ ఓ మహిళా ప్రాధాన్యం వున్న జానపద చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు చెప్పారు. కానీ ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. మొదటా సంఘమిత్ర పాత్ర కోసం శృతిహాసన్‌ను తీసుకోవడం.. ఆమె కొన్ని నెలలపాటు ట్రైనింగ్ తీసుకున్న తరువాత మూవీ నుంచి తప్పుకోవడం జరిగాయి. దీంతో ఈ పాత్రలో వేరే భామను తీసుకుంటారనే ప్రచారం జరిగింది కానీ.. ఎవరూ సెట్ కాలేదు. అనేకమంది హీరోయిన్స్ తర్వాత చివరకు ఇప్పుడు దిశా పటాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పుడు సంఘమిత్ర ఆగిపోయిందనే ప్రచారంపై మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టి మరీ స్పందించాడు దర్శకుడు సుందర్. తాము సంఘమిత్ర ప్రాజెక్టును ఆపేసే ప్రసక్తేత లేదని అంటున్నాడు ఈ డైరెక్టర్. ఈ స్క్రిప్ట్ కోసం 18 నెలలు తపించామని, స్టోరీబోర్డు ప్రిపేర్ చేస్తున్నామని అన్న దర్శకుడు గ్రాఫిక్ వర్క్ అవసరం కూడా ఈ చిత్రానికి చాలా వుంటుందని అంటున్నాడు. ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువగా సమయం పడుతోందని చెబుతున్న సుందర్, ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు చెప్పాడు.