రెండో సుడిగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్ కెరీర్‌లో సంచలన విజయం అందించిన సినిమా సుడిగాడు. కొంత గ్యాప్ తరువాత అదే కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించబోతున్న ఈ సినిమా ఈనెల 27న ప్రారంభం కాబోతోంది. అదే రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు చిత్ర యూనిట్. సుడిగాడు సినిమాకు సంగీతం అందించిన శ్రీవసంత్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. సునీల్ ఈ సినిమాలో అల్లరి నరేష్‌కు ఫ్రెండ్‌గా నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలో ఆ వివరాలు వెల్లడికానున్నాయి. సక్సెస్‌ఫుల్ సినిమా తీసిన యూనిట్ మళ్లీ కలిసి పని చేస్తుండడంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.