‘ఆచారి అమెరికా యాత్ర’ ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు విష్ణు హీరోగా నటించిన ఆచారి అమెరికా యాత్ర చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా 26న విడుదల కానున్నది. చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకులు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్‌ల చేతుల మీదుగా పాటల సీడీని విడుదల చేశారు. చిత్రం ట్రైలర్ కూడా విడుదల కాగా ఇంటర్‌నెట్‌లో విశేష స్పందన వస్తోంది. బ్రహ్మానందం, విష్ణుల కాంబినేషన్ కామెడీ ప్రధానంగా సాగే ట్రైలర్ చూస్తే చిత్రం ఆహ్లాదభరితంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. తమన్ అందించిన పాటలకు మంచి స్పందన వస్తోంది. జి.నాగేశ్వర్‌రెడ్డి-విష్ణుల కలయికలో దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం వంటి సూపర్‌హిట్ కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన విషయం తెలిసిందే. ఆచారి అమెరికా యాత్ర కూడా అదే తరహా వినోదాన్ని అందించనున్నదని ఆశించవచ్చు. విష్ణు సరసన ప్రజ్ఞ జైస్వాల్ నటించిన ఈ చిత్రాన్ని కీర్తి చౌదరి కిట్టు పద్మజ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించగా ఎం.ఎల్.కుమార్‌చౌదరి సమర్పిస్తున్నారు. విష్ణు, బ్రహ్మానందం కామెడీ చూస్తుంటే నాకు ఇరవై ఏళ్ల క్రితం మోహన్‌బాబు-బ్రహ్మానందం తీసిన అల్లరిమొగుడు గుర్తుకొస్తోంది. ఆ చిత్రం లాగా ఘనవిజయం సాదించాలని కోరుకుంటున్నాను అన్నారు దర్శకుడు కె.రాఘవేంద్రరావు. చిత్రం అన్ని కమర్షియల్ హంగులతో పూర్తి వినోదంతో చాలా రిచ్‌గా వచ్చిందని, చాలావరకు అమెరికాలో నిర్మించడం జరిగిందని, నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించారు అన్నారు దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి. హీరో విష్ణు మాట్లాడుతూ- డైరెక్టర్ నాగేశ్వర్‌రెడ్డి గురించి చెప్పాలంటే విన్నీని పెళ్లిచేసుకున్న తరువాత తర్వాత నెక్స్ట్ నేను పెళ్లిచేసుకున్నది ఆయనే్న అనుకుంటా. అంత గొడవ పడుతుంటాం మేము అన్నారు. నిర్మాత కీర్తి చౌదరి లాంటి స్ట్రాంగ్ ఉమెన్ ప్రొడక్షన్‌లో నటించినందుకు గర్వంగా ఉంది అన్నారు. తనికెళ్లభరణి, కోటశ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి, పృధ్వీ, విద్యుల్లేఖరామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్, ఠాకూర్ అనూప్‌సింగ్, సురేఖావాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: వర్మ, సంగీతం: ఎస్.ఎస్.తమన్, అచ్చు రాజమణి, మాటలు: డార్లింగ్ స్వామి, ఆర్ట్: కిరణ్, నిర్మాతలు: కీర్తి చౌదరి, కిట్టు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వర్‌రెడ్డి.