యుద్ధనారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజ జీవితంలో ప్రతి మహిళా యుద్ధనారినే. కాకపోతే మాలోపల మేం యుద్ధం చేసుకుంటుంటాం. అది బయటి ప్రపంచానికి అంతగా తెలియదు అని అంటోంది కంగనా రనౌత్. మహిళలకు సంబంధించిన అంశాలపై తనదైన శైలిలో కంగనా స్పందిస్తోంది. ప్రస్తుతం ఝాన్సీ వీరనారి లక్ష్మీబాయి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘మణికర్ణిక - ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా మహిళలు, వారిలో దాగున్న శక్తుల గురించి కంగనా స్పందిస్తూ- నాలో నేను ఓ వారియర్‌ని చూశాను. నాలోనూ యుద్ధం జరుగుతుంటుంది. కాకపోతే అది అంతగా ప్రసిద్ధి చెందదు. బయటకు కనిపించదు. నేనే కాదు ప్రతి మహిళా తాను నమ్మినదానికోసం పోరాటం చేస్తూనే వుంటుంది. పలు ప్రొడక్ట్స్‌కి బ్రాండ్ అంబాసిడర్లుగా యువ భారతీయ మహిళలు కావాలి. దానికి నా ఫేస్ ఫర్‌ఫెక్ట్ అని భావిస్తున్నాను అని తెలిపింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో మణికర్ణిక రూపుదిద్దుకుంటోంది.