పక్కాఇంటిలిజెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్‌జ్ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. పతాకంపై వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఇంటిలిజెంట్’. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ- ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పబ్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ పాట చిత్రీకరణతో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. సాయిధరమ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, నాజర్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్, దేవ్‌గిల్, వినీత్‌కుమార్, జె.పి, పథ్వీ, రఘుబాబు, కాదంబరి కిరణ్, విద్యుల్లేఖా రామన్, సప్తగిరి, తా.రమేష్, భద్రం, నల్లవేణు, రాహుల్ రామకృష్ణ, వెంకీ మంకీ, రాజేశ్వరి నాయర్, సంధ్య జనక్, ఫిష్ వెంకట్, శ్రీహర్ష, శివమ్ మల్హోత్రా, రవిరామ్ తేజ, తేజారెడ్డి నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్.వి.విశే్వశ్వర్, సంగీతం: తమన్, ఫైట్స్: వెంకట్, డాన్స్: శేఖర్, జాని, నిర్మాత: సి.కల్యాణ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.