సినిమాలే నా జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రయోగాత్మక సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు చేయాలన్నదే నా కోరిక’ అని అంటున్నారు హీరో విక్రమ్. ప్రయోగాల కథానాయకుడిగా కమల్‌హాసన్ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు. ఆయన చేసిన పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఒక వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే, ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధమనే విక్రమ్ తాజాగా ‘స్కెచ్’ చిత్రంతో మరోసారి ముందుకు వస్తున్నారు. విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విక్రమ్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
అదే స్కెచ్..
సాధారణంగా కిడ్నాప్ చేయడానికి లేదా ఏదైనా దోపిడీ చేయడానికి ఎవరినైనా చంపడానికో స్కెచ్ వేశారనే పదం వింటూంటాం. ఇందులో దానే్న టైటిల్‌గా పెట్టుకొని తీశాం. ఆ పాయింట్ చెబితే కథ తెలిసిపోతుంది. ఈ చిత్రంలో నేను కార్లు లోన్ తీసుకొని వాయిదాలు చెల్లించని వారిపై నాకు గ్రూప్‌తో కలిసి వారివద్ద లోన్ రికవరీ చేస్తుంటాను. ఇందులో నాకొక రౌడీ గ్యాంగ్ కూడా వుంటుంది. ఈ సందర్భంగా ఓ పెద్ద వ్యక్తితో గొడవ జరుగుతుంది. ఆ గొడవ ఎలాంటి పరిణామాలకు దారితీసిందనేదే స్కెచ్.
కథకు స్ఫూర్తి..
ఈ కథను దర్శకుడు ఏడేళ్ల క్రితం రాసుకున్నారు. తమిళనాడులో జరిగిన ఓ రియల్ సంఘటన ఆధారంగా రూపొందించిన కథ. ఈ కథ నాకు చెప్పడానికి దర్శకుడు రెండు నెలలపాటు తిరిగాడు. నేను బిజీగా వుండడంతో కుదరలేదు. తర్వాత కథ విని చాలా ఎగ్జయింటింగ్ అయ్యా. అంత బాగా నచ్చింది. ప్రస్తుతం లోకల్‌గా వుండే గూండాల నేపథ్యంలో కథ సాగుతుంది. రియాలిటీకి దగ్గరగా వుంటూ మంచి ఫాంటసీ కూడా వుంటుంది. ముఖ్యంగా కథలో చాలా ట్విస్ట్‌లు వుంటాయి.
ప్రయోగాలే కాదు..
విక్రమ్ అనగానే ప్రయోగాత్మక సినిమాలే కాదు, కమర్షియల్ సినిమాలు చాలా వున్నాయి. ఈ రెండూ నాకు రెండు కళ్లలాంటివి. ఈ కథలో సందేశం అంటూ ఏమీ లేదు. పక్కా కమర్షియల్ దారిలోనే తీశాం. నేను చేసిన ‘్ధల్’, ‘సామి’, ‘మల్లన్న’ వంటి సినిమాల తరహాలోనే ఈ ‘స్కెచ్’ వుంటుంది. దానికితోడు హీరోయిజం కొత్తగా వుండడమే గాకుండా పంచ్ డైలాగులు కావాలని తగ్గించాను.
తమన్నాతో కెమిస్ట్రీ..
ఈ చిత్రంలో తమన్నా పాత్ర చాలా కొత్తగా వుంటుంది. ఇందులో ఆమె బ్రాహ్మణ అమ్మాయిగా కనిపిస్తుంది. చాలా సీరియస్ పాత్ర. నేనేమో మెకానిక్ కమ్ రౌడీని. ఓ సాఫ్ట్ అమ్మాయికీ మాస్ అబ్బాయికి మధ్య జరిగే రొమాన్స్ బావుంటుంది. ముఖ్యంగా మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. తమన్నా అద్భుతమైన నటి. ‘బాహుబలి’ తర్వాత ఆ రేంజ్‌లో తనకు బాగా నచ్చిన కథ ఇదని చెప్పింది.
తెలుగులో చేస్తా..
తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలని నేనూ చూస్తున్నాను. మంచి కథలొస్తే తప్పకుండా చేస్తా. అయినా ప్రస్తుతం సినిమా రేంజ్ మారింది. ఇప్పుడు సబ్ టైటిల్స్‌తో ఒక భాషా చిత్రాన్ని మరో భాష వాళ్లు చూస్తున్నారు. అంతెందుకు? ‘బాహుబలి’ సినిమా తెలుగు సినిమా మాత్రమే కాదుకదా? అది గ్లోబల్ మూవీ. అలాగే ‘రోబో’, ‘అపరిచితుడు’ లాంటి చిత్రాలు అన్ని భాషల వారు చూశారు. ‘బాహుబలి’ సినిమా సౌత్ సినిమాకు గేట్లు తెరిచింది. దక్షిణాదిలో మంచి టాలెంట్ వున్న వాళ్లున్నారని నిరూపించింది.
అర్జున్‌రెడ్డితో మా అబ్బాయి..
మా అబ్బాయి ధృవ్ న్యూయార్క్‌లో మేథడ్ యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు. తనని మూడేళ్ల తర్వాత హీరోగా పరిచయం చేయాలని అనుకున్నాను. కానీ, అర్జున్‌రెడ్డిలాంటి మంచి సినిమా రావడంతో హీరోగా ఓకే అన్నాను. చాలా మంచి కథ ఇది. ముఖ్యంగా నటనకు మంచి ఆస్కారముంది. ఈ సినిమా తర్వాత మళ్లీ తను డైరెక్షన్ కోర్సు చేస్తాడు.
రాజకీయాల్లోకి..
నాకు పంచ కట్టుకోవడమే రాదు. రాజకీయాల్లోకి ఎలా వస్తాను? ఆ ఆస్కారం లేదు. ఎందుకంటే నాకు సినిమాయే జీవితం. స్వతహాగా నేను సిగ్గరిని. అందుకే రాజకీయాలు పడవు. వాటి జోలికి వెళ్లనుగాక వెళ్లను.
తదుపరి చిత్రాలు.. ప్రస్తుతం గౌతమ్ మీనన్‌తో ‘్ధృవ్ నక్షత్రం’ చేస్తున్నాను. దాంతో పాటు ‘సామి’ సీక్వెల్, అలాగే కమల్‌హాసన్ బ్యానర్‌లో ఓ థ్రిల్లర్ చేయనున్నాను. దాంతోపాటు ‘కర్ణ’ అనే చిత్రం ఫిబ్రవరిలో మొదలవుతుంది. ‘మహాభారతం’ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో పలు భాషలకు చెందిన ప్రముఖ నటీనటులుంటారు. మూడు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కే సినిమా అది. ఆస్కార్ స్థాయిలో వుంటుంది.

- శ్రీనివాస్ ఆర్.రావ్