కొత్త తరహా కథలపై మోజు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో నాగార్జున ఈ మధ్య కొత్త తరహా కథలపై మోజు పెంచుకుంటున్నారు. దానిలో భాగంగానే ఎప్పటికప్పుడు కథలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తున్న సీనియర్ హీరో నాగార్జున, ఎప్పటికప్పుడు కొత్త తరహా కథల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న యంగ్ హీరో నానిలు కలిసి మల్టీస్టారర్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తాజా సమాచారం మేరకు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 24 నుండి మొదలుపెడతారని సమాచారం. ప్రముఖ దర్శకుడు అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా వుండబోతున్న ఈ చిత్రంలో మంచి మలుపులతో కూడిన కథ కథనాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం నాగార్జున ఆర్‌జివి చిత్రంలోను, నాని ‘కృష్ణార్జున యుద్ధం’లోను నటిస్తున్న సంగతి తెలిసిందే.