సినిమాలందు ‘అ!’ సినిమా వేరయా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ హీరో నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్‌తో సంచలనం క్రియేట్ చేసిన నాని అటు నిర్మాతగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మతో నాని నిర్మించిన ‘అ!’ చిత్రం ఈనెల 15న విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ నటీనటులు కాజల్, రెజీనా, అవసరాల శ్రీనివాస్, నిత్యామీనన్, మురళీశర్మ, ప్రియదర్శి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్తదనానికే కొత్తదనంగా రూపొందిన ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని అంటున్నాడు నాని. ప్రమోషన్ విషయంలో కూడా భిన్నంగా చేస్తున్న ఈ సినిమా అమెరికాలో కూడా విడుదలవుతోంది. సినిమాలందు ఆ సినిమా వేరయా విశ్వదాభిరామ ఫిబ్రవరి 15న రిలీజ్‌రా మామా అంటూ ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.