గౌతమ్ మీనన్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ స్టార్ హీరో అజిత్, క్రేజీ దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో మరో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘ఎన్నై అరిందాల్’ చిత్రం తెలుగులో ‘ఎంతవాడుగానీ’ పేరుతో విడుదలైంది. ఘనవిజయం సాధించిన ఈ సినిమా తరువాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఆ చిత్రానికి సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం అజిత్, శివ దర్శకత్వంలో ‘విశ్వాసం’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 22నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈ సినిమా తరువాత అజిత్ గౌతమ్‌తో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెలువడే అవకాశం వుంది.