16న గోలీసోడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానస్, నిత్యా నరేష్ జంటగా మల్లూరి హరిబాబు దర్శకత్వంలో యస్.బి.ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై భువనగిరి సత్య సింధుజ నిర్మించిన ‘సోడా గోలీసోడా’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 16న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత సత్యసింధుజ వివరాలు తెలియజేస్తూ- పూర్తిస్థాయి వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కమర్షియల్ అంశాలతో తెరకెక్కించాం. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసిన ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు జరిగాయి. క్లీన్ యు సర్ట్ఫికెట్ వచ్చింది అన్నారు.