పాటల్లో శీనుగాడి ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుష్మా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శ్రీనివాసరావు హీరోగా ప్రణవి, కావేరి, చాందిని హీరోయిన్లుగా ఆర్.కె. దర్శకత్వంలో రూపొందిన శీనుగాడి ప్రేమ చిత్రానికి సంబంధించిన పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత ఆర్.కె.గౌడ్ సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- టీజర్, పాటలు బాగున్నాయి. కొత్తవారైనా నటీనటులు చక్కగా నటించారు. దర్శకుడు ఆర్.కె. అద్భుతంగా తెరకెక్కించాడు. కొత్తవారు పరిశ్రమకు వస్తేనే మరింత మనుగడ వుంటుంది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించాలి అన్నారు. దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ- మంచి టైటిల్ పెట్టారు. మంచి కథ, కథనాలతో సినిమా చేస్తే తప్పకుండా విజయం సాధిస్తుంది అన్నారు. సంగీత దర్శకుడు రమణ మాట్లాడుతూ- ఈ చిత్రానికి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. హీరో, నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ- నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆర్.కె. నాతో కలిసి మంచి కథ చెప్పాడు. కథ బాగా నచ్చడంతో సినిమా మొదలుపెట్టాం. నేనే నటిస్తూ నిర్మిస్తున్న చిత్రమిది. రమణ సాకే అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడు. టీమ్ ఇచ్చిన సహకారం మరువలేనిది. షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల చేస్తామన్నారు. దర్శకుడు ఆర్.కె మాట్లాడుతూ- శీను అనే పేరు దాదాపుగా ప్రతీ ఇంట్లో ఉంటుంది. ఈ కథ కూడా అందరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందించాం. లవ్, కామెడీ, ఎమోషన్‌లతో నిండిన ఈ కథను తప్పకుండా ఆదరిస్తారు అన్నారు.