ఎన్టీఆర్ కోసం అన్ని గెటప్పులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటుడు నందమూరి తారకరామారావు జీవిత కథతో తెరకెక్కనున్న ఎన్‌టిఆర్ చిత్రం కోసం సన్నాహాలు జోరందుకున్నాయి. ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌లో నటిస్తుండగా తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బాలకృష్ణ 103వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దింపుతున్నారు. మరోవైపు పలువురు ప్రముఖ నటీనటులు, టెక్నీషియన్లతో క్రేజీ ప్రాజెక్టుగా తెరకెక్కనున్నదట. ముఖ్యంగా ఎన్‌టిఆర్ పాత్ర కోసం బాలకృష్ణ అరవైకి పైగా గెటప్‌లలో కన్పిస్తాడట. ఎన్‌టిఆర్ అంటే రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, విశ్వామిత్రుడు లాంటి గెటప్‌లలో ఆయన కన్పించారు. ఇప్పుడు ఆ పాత్రలన్నీ తెరపై ప్రత్యక్షమవుతాయట. దానికోసం పలువురు మేకప్ నిపుణులను రప్పిస్తున్నారు. ఎన్‌టిఆర్ జీవితంలోని కీలక సన్నివేశాలతో తెరకెక్కే ఈ చిత్రాన్ని రెండున్నర గంటల్లో చెప్పడం అసాధ్యమైనప్పటికీ ఆ సమయంలోనే వీలైనంత సమాచారాన్ని అందించాలని స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. ప్రస్తుతం తేజ వెంకటేష్‌తో ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ నెల మూడవ వారంలో ఈ చిత్రం సెట్స్‌పైకి రానుంది. ఏప్రిల్ వరకు ఈ చిత్రాన్ని పూర్తిచేసి ఎన్‌టిఆర్ సినిమాను మే, జూన్‌లలో సెట్స్‌పైకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ సర్వత్రా ఆసక్తిని నింపింది.