ప్రేమ ఎంత మధురం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ.. అదో మధురమైన అనుభూతి.. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ప్రేమగురించి తెలుసుకోవాలంటే ప్రేమలో
పడితేనే సాధ్యమని అంటాడొక మహానుభావుడు. నిజమే! తరాలు మారినా. కాలాలు మారినా ప్రేమ మారదు..
ప్రేమించే మనుషులు మారొచ్చు కాని ప్రేమ ఎప్పటికీ అజరామరం. అందుకే సినిమాకు ప్రేమే కొలమానం..
*
ఎన్ని జోనర్స్‌లో సినిమాలు వచ్చినా.. అందులో కామ న్ పాయింట్ ప్రేమ. ప్రేమ లేని సినిమాలు వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ప్రేమించిన ప్రతి ప్రేమికుడు తన ప్రియురాలిని దక్కించుకోకపోవచ్చు. కాని తన జీవితకాలంలో ఆ ప్రేమ జ్ఞాపకాలను మాత్రం మరచిపోలేడు. ప్రేమ అద్భుతం.. అందుకే ఓ లైలా మజ్ను.. ఓ సలీం అనార్కలీ.. తమ ప్రేమ కోసం ప్రాణాల త్యాగం చేసిన రోజులున్నాయి. ప్రేమ విజయం దక్కినా... అపజయం ఎదురైనా రెండు జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయి. ‘రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు... కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో.. కలలోనే తీయగా గుర్తుతెచ్చుకో’ అంటాడు.. ఆ ప్రేమికుడు. అదే ప్రేమికుడు తన ప్రేమకు ఎవరైన అడ్డొచ్చినపుడు- ‘చిన్నప్పుడు మా పేదరికాన్ని చూసి ఎగతాళి చేశావ్! అప్పుడు రాయిపెట్టి కొట్టాలనుకున్నాము- అమ్మ అడ్డొచ్చింది.. ఇప్పుడు నా ప్రేమను ఎగతాళి చేస్తున్నావ్.. ఇప్పుడూ కొట్టాలనే ఉంది.. మా చెల్లి అడ్డొచ్చింది’ అంటాడు మరో ప్రేమికుడు తన ప్రేమను కాపాడుకోవాలని. ఇక ప్రేమలో విఫలమైన ప్రేమికుడు దేవదాస్ కాకపోవచ్చు కాని అతని వేదన ఎవరు వర్ణించలేరు.. అందుకే తన గుండె లోతుల్లో ఉన్న బాధను చెబుతూ.. ‘ప్రేమ లేదని ప్రేమించరాదని.. సాక్ష్యమే నీవని నన్ను నేను చాటని ఓ ప్రియా జోహారులు’.. ‘మరపు రాకపోతే మనిషే కాడని కటిక రాయికైనా కన్నీరుందని’ వలపు చిచ్చు రగులుతోంది ఆగిపొమ్మని గడియ పడిన మనసు తలపు తట్టి చెప్పని ముసురుపట్టి మూగవోయి నీ ఊపిరి మోడువారి నీడ తోడు లేకుంటిని.. గురుతు తెరిపివేసి జీవించాలని చెప్పలేకపోతే మరణించాలని తెలిసి కూడా తెలియలేని వెర్రివాడిని. గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్నుచూసి రోదించని.. అంటాడు. ఆ ప్రేమికుడి బాధను చూడలేని స్నేహితుడు.. ‘ఏముందిరా ప్రేమలో’ అంటే.. ‘ప్రేమకంత పవరే లేకపోతే ఆ అమ్మాయిని వెతుక్కుంటూ నేను రాను. నన్ను వెతుక్కుంటూ నువ్వు రావు’ అంటాడు. దటీజ్ లవ్.. ప్రేమకున్న పవరే అది.. ఇప్పటిదాకా వెండితెపై ఎన్నో ప్రేమ కధలను మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమకు భేదం లేదు.. ధనిక, పేద.. రాజు.. బీద ఎవడైనా సరే ఎప్పుడు ఎక్కడ ఎవరితో ప్రేమలో పడతారో చెప్పలేం. వెండితెరపై అద్భుతంగా ప్రేమకథల్లో నటించిన మన తారలు కూడా ప్రేమలో పడ్డ సంఘటనలు ఉన్నాయి. ప్రేమ సినిమాల్లోనే సుఖాంతమవుతుంది. నిజ జీవితంలో కాదు అంటుంటారు. కానీ రియల్ లైఫ్‌లోనూ.. రీల్ లైఫ్‌లోనూ ప్రేమను సుఖాంతం చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. ఇక తెలుగు పరిశ్రమలో ప్రేమలో పడి దాన్ని పెళ్లితో సాకారం చేసుకున్న స్టార్స్ చాలామందే ఉన్నారు. వారిలో మొదటగా చెప్పుకోవలసింది నా టితరం సూపర్‌స్టార్స్ కృష్ణ- విజయనిర్మల. ఆ తరువాత ప్రముఖ నటుడు నాగార్జున-అమల, పవన్‌కళ్యాణ్ - రేణుదేశాయ్, మహేష్- నమ్రత నుండి లేటెస్టుగా పెళ్లిచేసుకున్న సమంత-నాగచైతన్యలవరకూ అందరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నవారే.
*
కృష్ణ-విజయనిర్మల
సూపర్‌స్టార్‌గా అప్పట్లో తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్న కృష్ణ.. కెరీర్ మొదటినుండే విజయనిర్మలతో ప్రేమాయణం సాగించారు. ఆ తరువాత కొద్దిరోజులకే వీరు వివాహం చేసుకున్నారు. ఇప్పటికీ వీరిద్దరూ అన్యోన్యంగా తమ జీవితాన్ని గడుపుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అటు తెరపైన, ఇటు తెర వెనుకా వీరిది ఎవర్‌గ్రీన్ జంట అని పేరు మారుమ్రోగేది.
*
పవన్‌కళ్యాణ్ - రేణుదేశాయ్
సినిమా పరిశ్రమలో మరో ప్రేమకథ పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌దే. పవన్‌కళ్యాణ్ ‘బద్రి’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రేణుదేశాయ్‌తో ప్రేమలో పడ్డాడు. పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబానికి చెందిన రేణు.. మొదట మోడల్‌గానే తన కెరీర్ ప్రారంభించారు. 2000లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బద్రి చిత్రంలో పవన్ సరసన నటించారు. ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ఇద్దరిమధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రేమకు బీజం పడింది. ఆ తరువాత పవన్ దర్శకుడిగామారి చేసిన ‘జాని’ సినిమాలో కూడా రేణు హీరోయిన్. ఆ తరువాత వారి ప్రేమ ముదిరి పాకాన పడింది. ఆ తరువాత ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్ళకు ఇద్దరూ విడిపోవడం కూడా జరిగింది..
*
మహేష్‌బాబు-నమ్రత
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు కూడా మంచి ప్రేమికుడే. మహేష్ హీరోగా కెరీర్ మొదలుపెట్టిన తరువాత నటించిన నాలుగో సినిమాలో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ అమ్మాయి నమ్రతతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ కలిసి నటించిన వంశీ సినిమా వీరి ప్రేమకు గుర్తుగా మిగిలింది. దాదాపు ఐదు సంవత్సరాలు ప్రేమాయణం నడిపారు. ఆ తరువాత మహేష్, నమ్రతాను పెళ్లికి ఒప్పించినట్టు ఆమె చాలాసార్లుచెప్పింది. మొత్తాని కి వంశీ సినిమాలోని క్లైమాక్స్ లాగే నిజ జీవితంలో ఇద్దరూ ఒకటై శుభం కార్డు వేశారు. వీరిద్దరిని ముచ్చటైన జంటగా పిలుస్తారు.
*
శ్రీకాంత్- ఊహ
పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా నిలబడ్డ శ్రీకాంత్.. ఆ తరువాత నటించిన ఆమె సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఊహతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో రెం డు సినిమాలు వచ్చాయి. ఈ గ్యాప్‌లో ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడింది. ఆ తరువాత వివాహం చేసుకున్నారు. ప్రస్తుతంవీరి కుమారుడు రోషన్ నిర్మలా కానె్వంట్‌తో హీరోగా తెరంగేట్రం చేశాడు. వీరిద్దరూ ప్రేమికులకు ఆదర్శం.
*
రాజశేఖర్- జీవిత
యాంగ్రీ యంగ్‌మెన్‌గా పోలీసు పాత్రల్లో అదరగొట్టిన రాజశేఖర్... అప్పటికే హీరోయిన్‌గా కెరీర్ సాగిస్తున్న జీవితతో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ‘తలంబ్రాలు’. ఈ సినిమాలో జీవితను ప్రేమించి మోసం చేసిన రాజశేఖర్.. నిజ జీవితంలో మాత్రం ప్రేమించి పెళ్లిచేసుకుని జీవితాన్ని పంచుకున్నారు. పెళ్ళైన తరువాత రాజశేఖర్ సినిమాల్లో నటిస్తుండగా.. జీవిత మాత్రం నటనకు స్వస్తి చెప్పి రాజశేఖర్ నటించిన కొన్ని సినిమాలకు దర్శక నిర్మాతగా వ్యవహరించారు.
*
నాగార్జున అమల
టాలీవుడ్ కింగ్ నాగార్జున... మన్మథుడిగా అమ్మాయిల మనసు దోచే హీరోగా ఇప్పటికీ అదే ఇమేజ్‌ని ఫాలో అవుతున్నాడు. కాని ఆయన మనసు దోచింది మాత్రం అమల. హీరోయిన్‌గా మూడు నాలుగు సినిమాల్లో నటించిన అమలతో నాగార్జున శివ సినిమాతో ప్రేమలో పడ్డాడు. అప్పటికే కిరాయిదాదా, చినబాబు వంటి చిత్రాల్లో కలిసి నటించిన నాగార్జున, అమల ఈ సినిమాలోనూ జంటగా నటిస్తున్నారు. ఇద్దరిమధ్య మంచి పరిచయం వున్నప్పటికీ వీళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచింది మాత్రం ఈ సినిమా షూటింగేనట. ఆ సాన్నిహిత్యమే ప్రేమగా మారింది. అనంతరం మూడేళ్లపాటు డేటింగ్ చేసిన ఈ జంట 1992లో పెళ్లి చేసుకుని ఒక్కటైంది. వీరిద్దరిమధ్య వున్న అన్యోన్యత ఇప్పటి తరలాకు ఆదర్శం అని చెప్పాలి. నాగార్జునను పెళ్లిచేసుకున్న అమల సినిమాలకు గుడ్‌బై చెప్పి రెడ్‌క్రాస్ వ్యవహారాల్లో బిజీగా మారింది. ఇక అక్కినేని కుటుంబంలో దాదాపు మరో పాతికేళ్ల తరువాత మొదలైన రెండో ప్రేమకథ నాగచైతన్య-సమంతలదే. ఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్‌గా సినీ పరిశ్రమకు పరిచయం అయిన సమంత ఆ సినిమాతో చైతూని నిజంగానే మాయ చేసింది. సామ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన చైతూ ఆ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేస్తూ వచ్చాడు. ఈ గ్యాప్‌లోనే చైతూతో కలిసి నటించిన ఆటోనగర్ సూర్య, మనం చిత్రాలు చైతూ-సమంతలని దగ్గర చేశాయి. అలా మొదలైన వీళ్ల ప్రేమ గత ఏడాది పెళ్లితో సుఖాంతం అయింది.