‘ఛల్ మోహన్ రంగ’ టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్, మేఘా ఆకాష్ జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మిస్తున్న చిత్రం ‘్ఛలో మోహన్ రంగ’. మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. చిత్రం టీజర్‌ను పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ రోజు ఉదయం విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ‘్ఛల్ మోహన్ రంగ’ టీజర్‌కు లభిస్తున్న స్పందన ఎంతో సంతోషంగా ఉందని హీరో నితిన్ తన స్పందనను సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణలో ప్రముఖ నిర్మాత ఎన్.సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. హైదరాబాద్, ఊటీ, అమెరికాలలో ఇప్పటివరకు షూటింగ్ జరుపుకుందీ ఈ చిత్రం. ‘్ఛల్ మోహన్ రంగ’ చిత్రానికి సంబంధించి ఆఖరి పాట చిత్రీకరణ ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈసందర్భంగా చిత్ర నిర్మాత సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ- హీరో నితిన్‌పై ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. శేఖర్ ఈ పాటకు నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఏప్రిల్ 5న చిత్రం విడుదల కానుందని తెలిపారు. చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ- ప్రేమతో కూడిన కుటుంబ కథా చిత్రమిది. చాలా సరదాగా సాగుతుంది అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్ థమన్, కెమెరా: ఎం.నటరాజ సుబ్రణియన్, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, నృత్యాలు: శేఖర్.వి.జె, స్టంట్స్: స్టంట్ సిల్వ, రవివర్మ, నిర్మాత: ఎన్.సుధాకర్‌రెడ్డి, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కృష్ణచైతన్య.