అమెరికాలో ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇటీవలే హైదరాబాద్‌లో టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో అంగరంగ వైభవంగా కర్టెన్ రైజర్ వేడుక జరిగింది. తాజాగా ‘మా’ విదేశాల్లో సెలబ్రేట్ చేసేందుకు కూడా ముహూర్తం పెట్టేసింది. ఏప్రిల్ 28న అమెరికా డల్లాస్‌లో తొలి ఈవెంట్ గ్రాండ్‌గా జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా తెలిపారు. ఈవెంట్‌ను ఫిల్మ్ స్టార్ ఈవెంట్స్, తిరుమల ప్రొడక్షన్స్ ప్రై.లి. సంయుక్తంగా అమెరికాలో నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ- చిరంజీవిగారికి మా వేడుకల గురించి చెప్పగానే వెంటనే ఆయన ఒప్పుకున్నారు. అలాగే మహేష్‌బాబు కూడా వస్తానన్నారు. వీరిద్దరూ మాకు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. అలాగే బాలకృష్ణ, మోహన్‌బాబు, వెంకటేష్, నాగార్జున కూడా మంచి సపోర్టు ఇస్తున్నారు. నన్ను నమ్మి ‘మా’ ప్రెసిడెంట్ పదవిని అప్పగించింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. అలాగే పరభాషా హీరోయిన్లు అయినా మన తెలుగు హీరోయిన్లు అయినా సరే ఖచ్చితంగా ‘మా’లో మెంబర్‌షిప్ తీసుకోవాలి. అలాగే సిల్వర్ జూబ్లీ సందర్భంగా 35మందికి ఈనెల నుంచి 3వేల పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ‘మా’ అనుకున్న కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తిచేస్తామన్నారు.
జనరల్ సెక్రటరీ నరేష్ మాట్లాడుతూ- చిరంజీవి, మహేష్‌బాబు ‘మా’ జరిపే కార్యక్రమాలకు పూర్తిగా సహకారం అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. కార్యక్రమంలో నిఖిల్ నాంచారి (అమెరికా), మా వైస్ ప్రెసిడెంట్ బెనర్జి, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, కార్యవర్గ సభ్యులు ఉత్తేజ్, నాగినీడు, సురేష్, అనితా చౌదరి పాల్గొన్నారు.