దర్శకుడిగా మరో రచయిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతోషం, వెంకీ, ఢీ, దూకుడు లాంటి పలు సూపర్‌హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన గోపీమోహన్ త్వరలో దర్శకుడిగా మారబోతున్నారు. కొద్దికాలంగా దర్శకుడిగా మారే ప్రయత్నాలు మొదలుపెట్టిన గోపీమోహన్, ప్రస్తుతం తన సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నాడు. ‘ఇష్టంగా.. సంతోషంగా.. ఆనందంగా’ అన్న సాప్ట్ టైటిల్‌తో గోపీమోహన్ దర్శకుడిగా మారబోతున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా తన సినిమా పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. అతి త్వరలో ప్రేక్షకులకు నచ్చిన తారాగణంతో షూటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తానని, తనను ప్రోత్సహిస్తున్న తన మిత్రులకు, భాగస్వామికి శుభాకాంక్షలు తెలిపాడు గోపీమోహన్. ముగ్గురు హీరోలు నటించబోయే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తారు.