వరుణ్‌తేజ్‌ను చూసి గర్వపడుతున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘తొలిప్రేమ’ చిత్రం ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్ సభ్యులు, హీరో వరుణ్‌తేజ్, దర్శకుడు వెంకీ, నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్, బాపినీడులను హైదరాబాద్‌లోని తన ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ- తొలిప్రేమ పెద్ద సక్సెస్ అయిన సందర్భంగా టీమ్ అందరికీ అభినందనలు. సినిమా ఆలస్యంగా చూశాను. నా బ్రదర్ పవన్ తొలిప్రేమ టైటిల్‌తో వచ్చిన సినిమా అని చాలా క్యూరియాసిటీ కలిగింది. ఇదొక కాంటెంపరరీ లవ్‌స్టోరీ. కథకన్నా సిచ్యువేషన్‌లాగే అంతా ఉంటుంది. ఇలా సినిమా చేయడం దర్శకుడికి చాలా పెద్ద ఛాలెంజింగ్. సినిమా అంతా ప్రెష్‌గా వుందంటే కారణం డైరెక్టర్ థాట్‌వలనే. ఓ కొత్త కోణంలో సినిమా చూపించాడు. ఇలాంటి డైరెక్టర్స్ చిత్ర పరిశ్రమకు రావాలి. వరుణ్ తేజ్ చాలా మెచ్యూర్డ్‌గా నటించాడు. సినిమాలో తనని చూస్తున్నంతసేపు ఎవరో యంగ్ బాయ్ నటిస్తున్నట్లు అనిపించింది. ప్రేమ సన్నివేశాలు.. ఇగో క్లాషెస్ సన్నివేశాల్లో వరుణ్, రాశీఖన్నా చాలా ఇన్‌వాల్వ్ అయి చేశారు. వరుణ్ పెర్‌ఫార్మెన్స్ చూసి మా ఫ్యామిలీ అంతా గర్వపడుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కమర్షియల్ సినిమా ఇది అన్నారు. ఈ సక్సెస్ నాగబాబుకు ప్రైడ్ మూమెంట్. వరుణ్ వాళ్ల నాన్నకి మంచి బహుమతి ఇచ్చాడు అన్నారు. అనంతరం చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ- చిన్నప్పుడు స్టూవ్టవర్టుపురం పోలీసు స్టేషన్ సినిమా టైమ్‌లో చిరంజీవిగారిని చూశాను. మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవిగారి పక్కన కూర్చుని మాట్లాడే అవకాశం కలిగింది. ఈ అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేను. చిరంజీవిగారు సినిమా చూసి మమ్మల్ని పిలిచి ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా గర్వంగా ఉంది అన్నారు. నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ- 33 ఏళ్ల క్రితం సినిమాలు చేద్దామని మద్రాస్ వెళ్లాను. ఆ సమయంలో సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు ద్వారా చిరంజీవికి ఇంటికి వెళ్లాను. నిర్మాతకన్నా అక్కడ ఓ అభిమానిగానే చిరంజీవితో పరిచయం జరిగింది. ఇన్నాళ్లకు రామ్‌చరణ్, పవన్‌కళ్యాణ్, బన్నీ, ఇప్పుడు వరుణ్‌తో సినిమా చేసే అవకాశం లభించింది. అన్నీ పెద్ద హిట్ అయ్యాయి అన్నారు. హీరో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ- నాకు యాక్టర్ అవ్వాలన్న ఆలోచన చిరంజీవిగారిని చూసే వచ్చింది. ఈ రోజు డాడీ వచ్చి మంచి మాటలు చెబుతుంటే చాలా సంతోషంగా ఉంది అన్నారు. సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ- నేను చిరంజీవిగారికి పెద్ద ఫాన్‌ని. ఆయన మమ్మల్ని గుర్తించి ఇలా పిలిచి ప్రశంసించడం మాకు చాలా ఆనందాన్నిస్తోంది అన్నారు.