సన్నీని బీట్ చేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రియా ప్రకాశ్ వారియర్’.. ఎక్కడ విన్నా ఇప్పుడు ఈ పేరే వినిపిస్తోంది. ఆమె ఓవర్‌నైట్‌లో అంతలా పాపులర్ అయిపోయింది మరి. ఎంతగా అంటే... చివరకు పోర్న్ సుందరి సన్నీ లియోన్‌ను కూడా క్రాస్ చేసేటంతగా. అవును.. నిజంగానే. గత రెండు మూడు రోజులుగా గూగుల్‌లో అత్యధికంగా శోధిస్తున్న పేరు ప్రియా ప్రకాశ్‌దేనట. ఆ రకంగా సన్నీని ఆమె పక్కకు నెట్టేసింది. నెట్‌లో వైరల్‌గా మారిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’ చిత్రంలోని ‘మాణిక్య మలరాయపూవే’ పాటలోని ఆమె ఎక్స్‌ప్రెషన్లు నెటిజన్లను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాయి. ‘‘ఒక్క పాటతో నాకు ఇప్పుడు దక్కుతున్న ఆదరణ ననె్నంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలు ఏమి మాట్లాడాలో అర్థం కావడంలేదు. నాకు మాటలు రావడంలేదు. మొత్తానికి నాకు చాలా ఆనందంగా ఉంది’’ అని ప్రియా తెలిపింది. తనకు క్రేజ్ తీసుకొచ్చిన ‘కనుబొమ్మ ఎక్స్‌ప్రెషన్’ గురించి ఈ క్యూట్ గాళ్ వివరించింది. దర్శకుడు, తన సహనటుడు రోషన్ తనను కొన్ని క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌లు ఇవ్వాలని కోరారని, అప్పుడే కనుబొమ్మ ఎక్స్‌ప్రెషన్ అలా ఒకే టేక్‌లో వచ్చేసిందని ఆ ముద్దుగుమ్మ సిగ్గుపడుతూ చెప్పుకొచ్చింది.