మెగా ‘సైరా..’ కోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న‘సైరా.. నరసింహారెడ్డి’ సినిమా వచ్చే వారంలో రెండో షెడ్యూల్ మొదలుకానుంది. సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార, అమితాబ్, జగపతిబాబు లాంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. భారీ ప్రతిష్ఠాత్మకంగా మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంగీత సంచలనం రెహమాన్ సంగీతం అందిస్తారని యూనిట్ పేర్కొంది. కానీ ఆయన కొన్ని కారణాలవల్ల ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ఎవరు పనిచేస్తారా? అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ సమయంలో కీరవాణి, థమన్‌లు సంగీతం అందిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్‌గా ఈ ప్రాజెక్టులోకి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయనతో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఓకే అంటే రీ రికార్డింగ్ మొదలుపెట్టనున్నారు. మెగాస్టార్ 151వ చిత్రంగా తెరకెక్కే ఈ సినిమాను రామ్‌చరణ్ నిర్మిస్తున్నాడు.