శ్రీదేవి జీవితంపై..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు యాభై ఏళ్లుగా సినీ రంగంలో కథానాయికగా వెలుగులు విరజమ్ముతున్నారు అతిలోక సుందరి శ్రీదేవి (53). తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం- పరిశ్రమ ఏదైనా శ్రీదేవికి ఉన్న గుర్తింపు అసాధారణం. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిగా వీరాభిమానులున్నారు. ఐదు దశాబ్దాల కెరీర్‌లో వందలాది సినిమాల్లో నటించి మెప్పించారు. చివరిగా బాలీవుడ్ నాయికగా సెటిలై అక్కడే బోనీకపూర్‌ని పెళ్లాడి లైఫ్‌లో సెటిలయ్యారు. శ్రీదేవి నట జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు.. అనుభవాలు.. అనుభూతులు.. వాటన్నింటినీ తెరకెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఇవి ఫీచర్ సినిమాలు కావు డాక్యుమెంటరీలు. ఐదు భాగాలుగా ఐదు డాక్యుమెంటరీ సినిమాలుగా తెరకెక్కించేందుకు శ్రీదేవి బెంగుళూరు అభిమాన సంఘం రెడీ అవుతోంది. ఆ మేరకు ఇప్పటికే శ్రీదేవి భర్త బోనీకపూర్ అనుమతి తీసుకున్నారు. శ్రీదేవి బాల్యం.. బాలనటిగా కెరీర్‌పై ఓ సినిమా, యుక్తవయస్సులో కథానాయిక అరంగేట్రం చేసి కెరీర్‌లో వెలుగులు విరజిమ్మిన తీరుపై ఓ రెండు సినిమాలు, అలాగే కథానాయికగా పీక్స్‌లో ఉండగానే బోనీని పెళ్లాడినప్పటి జీవితం, ఫ్యామిలీ లైఫ్ వరకూ మరో డాక్యు సినిమా తెరకెక్కించనున్నారు. ఐదు సినిమాల్లో శ్రీదేవి యాభై ఏళ్ల సినీ కెరీర్ సాగించిన జీవనయానం కన్పిస్తుంది. ఒక మేటి కథానాయిక చరిత్రను ఇలా డాక్యు సినిమాలుగా నిక్షిప్తం చేయడం భావి తరాలకు ఎంతో ఉపయుక్తం. ప్రశంసించదగ్గ ప్రయత్నం అనే చెప్పాలి.